కేరళలో కొవిడ్ కేసులు శుక్రవారంతోపోలిస్తే స్వల్పంగా పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 20,367 కేసులు నమోదయ్యాయి. మరో 20,265 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 139 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.33 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,654 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,610 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 32 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,773కు పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 72 కొవిడ్ కేసులు నమోదవగా.. మరొకరు మరణించారు.