తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరబిక్​లో ఎడమ నుంచి కుడికి రాసి రికార్డ్​ - india book of records

కేరళకు చెందిన జలీల్​ అనే యువకుడు అరుదైన రికార్డ్​ నెలకొల్పాడు. జాతీయ గీతాన్ని అరబిక్​లో ఎడమ నుంచి కుడికి కేవలం 2.47 నిమిషాల్లో రాశాడు. ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు.

kerala
కేరళ యువకుడి అరుదైన రికార్డ్​

By

Published : Feb 24, 2021, 1:37 PM IST

అరబిక్​లో ఎడమ నుంచి కుడికి రాసి రికార్డ్​!

కుడి నుంచి ఎడమకు రాసే అరబిక్​ భాషలో ఆరి తేరిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. కేరళలోని పాలక్కడ్​ జిల్లా పుడుసెరికి చెందిన 24 ఏళ్ల అబ్దుల్​ జలీల్..​ జాతీయ గీతాన్ని అరబిక్​లో ఎడమ నుంచి కుడికి, కింద నుంచి పైకి రాసి రికార్డ్​ నెలకొల్పాడు. మన్నర్​కడ్​ తహసీల్దార్​ ఎన్​ఎం రఫీ పర్యవేక్షణలో కేవలం రెండు నిమిషాల 47 సెకన్లలో రాయడం పూర్తి చేశాడు.

కన్నూరు విశ్వవిద్యాలయంలో అరబిక్​లో పీజీ చేస్తున్న సమయంలో సరదాగా జలీల్​ చేసిన ప్రయత్నమే అతడిని రికార్డ్​ నెలకొల్పేలా చేసింది. విరామ సమయాల్లో అరబిక్​ను తిరగరాసే ప్రయత్నం చేస్తున్న జలీల్​ను చూసి అతని స్నేహితులు ప్రోత్సహించారు.

లాక్​డౌన్​లో..

గతేడాది లాక్​డౌన్ సమయంలో ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​ గురించి తెలుసుకున్న జలీల్​.. తన అభిరుచిపై మరింత కృషి చేశాడు. ఇందుకోసం ప్రతిరోజు రాత్రి 2 గంటలు సమయం కేటాయించాడు. మొదట 100 మంది అమరుల పేర్లను రాయలని అనుకున్నాడు. కానీ వాటిని అరబిక్​లో నేర్చుకునేందుకు సమయం పడుతుండటం వల్ల జాతీయ గీతంపై కసరత్తులు ప్రారంభించాడు. నెలన్నర సాధన తర్వాత చేసిన మొదటి ప్రయత్నంలోనే జలీల్​ ఈ ఘనత సాధించాడు.

ఇదీ చదవండి :తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?

ABOUT THE AUTHOR

...view details