జిమ్నాస్టిక్స్ చేస్తున్న ఆండ్రియా గతేడాది లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. కేరళకు చెందిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రం ఇంట్లో ఖాళీగా ఉండిపోలేదు. తనకు దొరికిన సమయాన్ని చక్కగా వినియోగించుకుంది. తనంతట తానుగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంది. ఇప్పుడు జిమ్నాస్టిక్స్లో అద్భుత విన్యాసాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది కేరళవాసి ఆండ్రియా.
శరీరాన్ని రబ్బరులా వంచిన ఆండ్రియా! ఆండ్రియా జిమ్నాస్టిక్స్ విన్యాసాలు యూట్యూబ్ చూసి..
ఇడుక్కి జిల్లా తోడుపుజాకు చెందిన ఆండ్రియా.. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. లాక్డౌన్ సమయంలో యూట్యూబ్లో వీడియోలు చూసి జిమ్నాస్టిక్స్ చేయడంపై ఆమె ఆసక్తి పెంచుకుంది. అనంతరం తాను కూడా అలా చేయాలని ప్రయత్నించింది. మెల్లమెల్లగా తన శరీరాన్ని జిమ్నాస్టిక్స్ చేసేందుకు అనువుగా మార్చుకుంది. ఒకదాని వెంట మరొక విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎనిమిది రకాల ఫీట్లను అవలీలగా చేయగలదు ఈ చిన్నారి.
జిమ్నాస్టిక్స్ చేస్తున్న ఆండ్రియా వద్దన్న అమ్మానాన్నే..
జిమ్నాస్టిక్స్ చేయడం ప్రారంభించిన కొత్తల్లో చిన్నారి ఆండ్రియాను తన తల్లిదండ్రులు నిరుత్సాహపరిచారు. కానీ ఎప్పడైతే వారు తమ కుమార్తె ప్రతిభను గుర్తించడం ప్రారంభించారో అప్పటినుంచి ఆమెను వారెంతో ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా స్టార్ చైల్డ్ జిమ్నాసిస్ట్గా పేరు తెచ్చుకుంది ఆండ్రియా. ఇప్పుడు ఆమెకు తన తల్లిదండ్రులు జిమ్నాసిస్టిక్స్లో మంచి శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు.
ఆండ్రియా సోదరి, నాన్న, అమ్మ చిన్నారి ఆండ్రియా.. జిమ్నాస్టిక్స్లోనే కాదు సినిమాల్లోనూ తన ప్రతిభ నిరూపించుకునేందుకు సిద్ధమైంది. కోడా అనే మళయాలం సినిమాలో నటుడు శ్రీజిత్ రవి కూతురుగా నటిస్తోంది.
ఇదీ చూడండి:సౌండ్ చేశారో.. హారన్లు రోడ్డురోలర్ కిందకే!
ఇదీ చూడండి:ఆన్లైన్ గేమ్ కోసం అమ్మ నగలనే..