తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!

"ఇన్నేళ్లుగా ఈ జిల్లా వ్యవహారాల్ని నేను చూశా. ఇకపై మీ వంతు. జాగ్రత్తగా నిర్వర్తించండి" అంటూ భర్తకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు ఓ మహిళ. ఎందుకలా? ఎక్కడ?

kerala collector couple
'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!

By

Published : Jul 27, 2022, 2:23 PM IST

Updated : Jul 27, 2022, 3:11 PM IST

'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!

కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్ మంగళవారం అరుదైన సంఘటనకు వేదికైంది. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించి వెళ్లిపోయారు భార్య. అదే సమయంలో కాంగ్రెస్​ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్​ కూటమికి చెందిన కార్యకర్తలు.. కలెక్టరేట్​ బయట తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. ఈ అధికార బదిలీని వ్యతిరేకించారు.

ఇదంతా ఎందుకంటే.. రేణు రాజ్.. ఇప్పటివరకు అలెప్పీ కలెక్టర్​గా పనిచేశారు. ఇటీవలే ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్​ వెంకట్రామన్​ను నియమించింది. రేణు, శ్రీరామ్.. భార్యాభర్తలు కావడం విశేషం. వృత్తిరీత్యా వైద్యులైన వారిద్దరూ తర్వాత ఐఏఎస్​లుగా మారారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు శ్రీరామ్. మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుళ జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు.

నిరసనల స్వాగతం.. ఇంతటి అరుదైన సన్నివేశానికి వేదికైన అలెప్పీ కలెక్టరేట్.. అదే సమయంలో నిరసనలతో హోరెత్తింది. శ్రీరామ్​కు కలెక్టర్​ బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుబడుతూ యూడీఎఫ్​ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గతంలో శ్రీరామ్ వెంకట్రామన్​పై నమోదైన కేసే ఇందుకు కారణం.

2019లో శ్రీరామ్.. తన స్నేహితురాలు వఫా ఫిరోజ్​తో కలిసి కారులో వేగంగా వెళ్తూ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఆ బైక్​పై ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మృతిచెందారు. ఈ కేసులో బెయిల్​ పొంది, విచారణ ఎదుర్కొంటున్న శ్రీరామ్​ను కేరళ ప్రభుత్వం 2020లో తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే.. ఇప్పుడు కలెక్టర్​ పోస్టు ఇవ్వడంపై కాంగ్రెస్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "జిల్లా కలెక్టర్​ అంటే జిల్లా మెజిస్ట్రేట్. 'నిందితుడు' అయిన వ్యక్తి ప్రజలకు ఎలా న్యాయం చేయగలరు?" అనేది కాంగ్రెస్​ వాదన.

Last Updated : Jul 27, 2022, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details