స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న వేళ సంక్షేమ పథకాల్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వాటి పట్ల వ్యతిరేక వాతావరణాన్ని దేశంలో సృష్టిస్తున్నారని మండిపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఉచిత హామీలు దేశాభివృద్ధికి ఎంతో ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో హెచ్చరించిన నేపథ్యంలో దిల్లీలో వర్చువల్ ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.
'ఉచిత విద్య, వైద్యంపై ఎందుకీ వ్యతిరేకత? కరెంట్ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిందే!' - kejriwal on modi
Kejriwal news electricity : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు 'ఉచితాల'నే ముద్ర వేసి, వాటి పట్ల వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా విద్య, వైద్యం, 300 యూనిట్ల విద్యుత్, నిరుద్యోగ భృతిని అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Kejriwal free electricity : "మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. సంక్షేమ పథకాల్ని మరింత బలోపేతం చేయాల్సిన ఈ సమయంలో వాటికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ఉచితంగా విద్య, వైద్యం అందించడాన్ని కొందరు తాయిలాలు అంటున్నారు. వారి స్నేహితులకు మాత్రం రూ.10 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. అందుకే అలాంటి వారిని ద్రోహులు అనాలి. వారిపై విచారణ జరిపించాలి. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విద్య, వైద్యం, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్, నిరుద్యోగ భృతిని అందించాలి" అని డిమాండ్ చేశారు కేజ్రీవాల్.