వరుస ఉగ్రదాడులతో జమ్ముకశ్మీర్ మంగళవారం సాయంత్రం ఉలిక్కిపడింది(srinagar terror attack). గంట వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రో సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తొలి ఘటన..
జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ కశ్మీరీ పండిట్, మఖన్ లాల్ బింద్రో ఫార్మసీ యజమాని బింద్రో(68)ను ఉగ్రవాదులు కాల్చిచంపారు(jk terror attack). శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న ఫార్మసీలో బింద్రో.. మందులను పంపిణీ చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు. బింద్రోను పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చారు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. మార్గం మాధ్యలోనే బింద్రో ప్రాణాలు వీడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
1990 వలసల అనంతరం జమ్ముకశ్మీర్‌లోనే ఉండిపోయిన అతికొద్ది మంది కశ్మీరీ పండిట్లలో బింద్రో ఒకరు. ఆయన భార్యతో ఉండిపోయి ఫార్మసీ వ్యాపారాన్ని కొనసాగించారు(kashmiri pandits news).