కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన గవర్నర్ కార్యాలయానికి వెళ్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి.
గవర్నర్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయమే అభ్యర్థన పంపిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీనికి గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న గహ్లోత్.. సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చారని స్పష్టం చేశారు.
ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. విధాన సౌధలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం తన సన్నిహితులైన మంత్రులతో యడియూరప్ప భేటీ కానున్నారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాజ్‌భవన్‌కు వెళ్తారని వివరించారు.
రాజీనామానా? కాదా?