తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆవు కడుపులో 75 కిలోల ప్లాస్టిక్​ వ్యర్థాలు​

కర్ణాటక ధార్వాడ్​లో ఓ ఆవు కడుపులో నుంచి దాదాపు 75కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు వైద్యులు. అయితే వారి శ్రమకు ఫలితం దక్కలేదు. తీవ్ర అనారోగ్యంతో గోమాత మరణించింది.

Plastic waste in cow stomach
ఆవు కడుపులో 75 కిలోల ప్లాస్టిక్​ వ్యర్థాలు​

By

Published : Nov 3, 2021, 8:49 AM IST

మన సౌలభ్యం కోసం ప్లాస్టిక్​ వస్తువులను తరచుగా ఉపయోగించడం అలవాటే. కానీ ఈ అలవాటు మూగ జీవాల పాలిట శాపంగా తయారైంది. మనం వాడిన ప్లాస్టిక్​ వస్తువులను చెత్తకుప్పల్లో పడేసి చేతులు దులుపుకుంటున్నాం. ఆహార వేటలో ఆ మూగ జీవాలు ప్లాస్టిక్​ వస్తువులను తిని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. ఇందుకు కర్ణాటకలో జరిగిన సంఘటనే ఓ ఉదాహరణ.

గోమాత కడుపులోని ప్లాస్టిక్ వ్యర్థాలు
ఆవు కడుపులో నుంచి బయటకు తీసిన ప్లాస్టిక్​ వ్యర్థాలతో స్థానికులు

ధార్వాడ్ జిల్లాలోని కల్యాణ నగర ప్రాంతంలో ఓ ఆవు అస్వస్థతకు గురైంది. దీంతో స్థానికులు పశువైద్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్యులు.. గోమాత కడుపులో ప్లాస్టిక్​ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి ఆవు కడుపులో నుంచి దాదాపు 75 కిలోల ప్లాస్టిక్​ పదార్థాలను బయటకు తీశారు. అయితే వారి శ్రమ వృథా అయిపోయింది. ఆ గోమాత మరణించింది. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:అడవులకు పశు తాకిడి- హరించుకుపోతున్న పచ్చదనం

ABOUT THE AUTHOR

...view details