లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనను(Lakhimpur Kheri incident) సుమోటోగా తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్(Kapil Sibal latest news).
"సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ లేని రోజుల్లో మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్నో కేసులను సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు (supreme court news) విచారణ జరిపింది. ప్రజల తరఫున గళం వినిపించింది.ఈ రోజుల్లో దేశ పౌరులను తొక్కించి చంపేస్తున్న ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పందించాలి" అని లఖింపుర్ ఖేరి ఘటనను ఉద్దేశించి సిబల్ ట్వీట్ చేశారు.
లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri news) ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సిబల్ సోమవారం కోరారు. ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.