తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ యువతి మృతి కేసులో ఇంకో ట్విస్ట్.. మరో ఇద్దరి కోసం పోలీసుల వేట - కారు ప్రమాదంలో మృతి చెందిన అంజలి లేటెస్ట్ న్యూస్

దేశ రాజధాని దిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొన్న ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులు అనుమానితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

delhi car accident latest news
పోలీసు అధికారి సీపీ హోండా

By

Published : Jan 5, 2023, 2:52 PM IST

Updated : Jan 5, 2023, 3:19 PM IST

దిల్లీలో జనవరి 1న స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు అనుమానితులుగా ఉన్నట్లు దిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

"ఈ ఘటనలో ఐదుగురు నిందితులను మేము అరెస్టు చేసి, వారిని విచారిస్తున్నాం. మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని మా విచారణలో తేలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు అనుమానితులు అశుతోష్, అతని సోదరుడు అంకుష్. ప్రస్తుతం వారిని పట్టుకునే పనిలో మా పోలీసు బృందాలు ఉన్నాయి. కస్టడీలో ఉన్న ఐదుగురు నిందితులకు వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరూ నిందితులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. పోస్టుమార్టంలో అంజలి లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు లభించలేదు.".
- సాగర్ ప్రీత్ హుడా, దిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఇద్దరు సోదరులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మొత్తం 18 పోలీసు బృందాలు పని చేస్తున్నాయి. పోలీసుల విచారణలో దీపక్ కారును అమిత్ డ్రైవ్ చేశాడని తెలిసింది. ఈ కేసులో అంజలితోపాటు స్కూటీపై ప్రయాణించిన ప్రత్యక్ష సాక్షి నిధి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. నిందితులకు, నిధికి మధ్య ఎలాంటి సంబంధం లేనట్లు తేలిందని పోలీసులు స్పష్టం చేశారు.

Last Updated : Jan 5, 2023, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details