తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1,700 అడుగుల కొండను 2 గంటల్లో ఎక్కేసిన 'కోతిరాజ్​' - 1700 అడుగుల కొండను ఎక్కిన కోతిరాజ్​

కేవలం 2 గంటల్లోనే 1,700 అడుగుల ఎత్తైన కొండను ఎక్కాడు ఓ వ్యక్తి. కేవలం చేతుల సహాయంతోనే ఎక్కి ఔరా అనిపించాడు. అనంతరం కొండ పైభాగంలో కన్నడ జెండాను ఎగురవేశాడు.

man climbs 17000 feet in 2 hours
man climbs 17000 feet in 2 hours

By

Published : Feb 13, 2023, 6:53 PM IST

1,700 అడుగుల కొండను చేతులతో పాకుతూ ఎక్కిన కోతిరాజ్​

1,700 అడుగుల ఎత్తైన కొండను చేతులతో పాకుతూ ఎక్కి ఔరా అనిపించాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ఈ సాహసాన్ని కేవలం 2 గంటల్లోనే పూర్తిచేశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రఖ్యాత నరసింహ గద కొండను కేవలం చేతుల సహాయంతోనే ఎక్కి.. కన్నడ జెండాను ఎగురవేశాడు జ్యోతిరాజ్​ అనే వ్యక్తి. ఆదివారం ఉదయం దుర్గాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి​.. ఈ సాహసాన్ని మొదలుపెట్టాడు జ్యోతిరాజ్. ఇందుకోసం అటవీ శాఖ అధికారుల అనుమతిని తీసుకున్నాడు. రక్షణగా నడుము చుట్టూ తాడును కట్టుకుని ఈ సాహసాన్ని పూర్తి చేశాడు. ఉదయం 9:50 గంటలకు ఎక్కడాన్ని ప్రారంభించిన జ్యోతిరాజ్​.. మధ్యలో 20 నిమిషాల విరామం తీసుకున్నాడు. అనంతరం తిరిగి ప్రారంభించిన జ్యోతిరాజ్​.. కొండపైకి ఎక్కి జెండాను ఎగురవేశాడు. సాహసాన్ని పూర్తి చేసిన జ్యోతిరాజ్​ను అనేకమంది అభినందిచారు.

కొండను ఎక్కుతున్న జ్యోతిరాజ్​

కర్ణాటక కోతిరాజ్​గా గుర్తింపు
ఇప్పటికే అనేక సాహసాలు చేసిన జ్యోతిరాజ్​ను.. కర్ణాటక కోతిరాజ్​గా పిలుస్తారు. ఎంతో ఎత్తైన గోడలను సెకన్లలోనే ఎక్కుతాడు. చిత్రదుర్గ్​లోని ఎత్తైన కోటను కూడా ఎక్కాడు. గతేడాది 405 అడుగుల జాతీయ జెండా స్తంభాన్ని ఎక్కి ఘనత సాధించాడు. అజాదీ కా అమృత్​ మహోత్సవ్​ సమయంలో ఈ సాహసాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నాడు జ్యోతిరాజ్​. రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అనేక విన్యాసాలు చేశాడు. తన సొంత డబ్బులతో 15 మంది యువతకు కూడా కొండలు ఎక్కడంలో శిక్షణ ఇస్తున్నాడు జ్యోతిరాజ్​.

ABOUT THE AUTHOR

...view details