సంచలన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించి, విశ్రాంతి పొందిన న్యాయమూర్తి సురేంద్రకుమార్ యాదవ్.. ఉత్తర్‌ప్రదేశ్ మూడో ఉప లోకాయుక్తగా నియమితులయ్యారు. ఈ మేరకు లోకాయుక్త సంజయ్ మిశ్రా సోమవారం ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపలోకాయుక్త పదవీకాలం ఎనిమిదేళ్లు. పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, అధికారాల దుర్వినియోగం వంటి వ్యవహారాలపై లోకాయుక్త వ్యవస్థ విచారణ చేపడుతోంది.
ఉపలోకాయుక్తగా 'బాబ్రీ' తీర్పు చెప్పిన న్యాయమూర్తి - justice surendra kumar yadav
బాబ్రీ కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన విశ్రాంత న్యాయమూర్తి సురేంద్రకుమార్ యాదవ్.. ఉత్తర్‌ప్రదేశ్ మూడో ఉపలోకాయుక్తగా నియమితులయ్యారు. లోకాయుక్త సంజయ్ మిశ్రా సోమవారం ఆయనతో ప్రమాణం చేయించారు.
జస్టిస్ సురేంద్ర కుమార్ యాదవ్
సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జిగా.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ చేపట్టిన సురేంద్రకుమార్ గతేడాది తీర్పు వెలువరించారు. భాజపా సీనియర్ నేతలు ఆడ్వాణీ, ఎంఎం జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ సహా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 32 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.
ఇదీ చదవండి :బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారంపై ఒకరోజు నిషేధం