ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రికాషన్ డోసును పంపిణీ చేయడాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో పదకొండు సార్లు కరోనా బారిన పడిన మహేశ్ ఉత్తమ్ చందానీ అనే వ్యక్తి ప్రికాషన్ డోసును తీసుకున్నారు. జోధ్‌పుర్‌లోని ఓ టీకా పంపిణీ కేంద్రంలో మూడో డోసు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
"నేను ఇప్పటి వరకు 11 సార్లు వైరస్ బారిన పడ్డాను. 40 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాను. ప్రికాషన్ డోస్ వేస్తున్నారు అని తెలియగానే పరుగున వచ్చాను. నా వంతు బాధ్యతగా మూడో డోసు తీసుకున్నాను. అర్హులు అందరూ కూడా నాలానే బూస్టర్ డోసు తీసుకోవాలని కోరుతున్నాను. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు ముందుకు రావాలి."
-మహేశ్ ఉత్తమ్ చందానీ, 11 సార్లు కొవిడ్ బారిన పడిన వ్యక్తి