జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో భారీ పేలుడు జరగకుండా అధికారులు నివారించారు. నిత్యం రద్దీగా ఉండే జమ్ము-పూంఛ్ జాతీయ రహదారిపై ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఐఈడీని పోలీసులు సకాలంలో గుర్తించారు. దీంతో భారీ పేలుడుకు సంబంధించిన ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు తెలిపారు.
"ఈ ఉదయం సైన్యం గస్తీకి వెళ్లింది. రాజౌరీ మాంజాకోట్లోని జాతీయ రహదారి పక్కన పేలుడు పదార్థం గుర్తించాం. ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకొని బాంబ్‌ను నిర్వీర్యం చేశాం. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం."