తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్ ఆరో విడత 'స్థానిక సమరం' సమాప్తం

జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఆరో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అవాంఛనీయ ఘటనలేవీ తలెత్తలేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.51 శాతం ఓటింగ్ నమోదైంది.

jammu and kashmir ddc elections
కశ్మీర్ ఎన్నికలు

By

Published : Dec 13, 2020, 3:41 PM IST

Updated : Dec 13, 2020, 8:21 PM IST

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల ఆరో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా సాగిందని అధికారులు తెలిపారు. అవాంఛిత ఘటనలేవీ తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.51 శాతం పోలింగ్ నమోదైంది. జమ్ములో పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు.. ఓటింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఉదయం భారీగా పొగమంచు కమ్మేసినప్పటికీ ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొన్నారు.

పొగమంచు పడుతున్నా ఓటేసేందుకు వచ్చిన జనం

అయితే కశ్మీర్ డివిజన్​లో.. ఓటింగ్ తక్కువగానే నమోదైంది. పుల్వామా, షోపియాన్​లో పోలింగ్ శాతం రెండంకెలకు మించలేదని తెలుస్తోంది. కశ్మీర్​లో ఇటీవల భారీ మంచువర్షం కురవడం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఓటింగ్ శాతం తగ్గడానికి ఇదో కారణంగా తెలుస్తోంది.

ఓటేసేందుకు వరుసలో నిల్చున్న మహిళలు

31 స్థానాలు- 245 మంది అభ్యర్థులు

18 జిల్లాల్లో ఉన్న మొత్తం 31 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. 245మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మొత్తం 2,071 పోలింగ్​ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 77 సర్పంచ్​ స్థానాలకు కూడా ఆదివారమే పోలింగ్ జరిగింది. ఈ స్థానాలకు 229 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఓటేసిన తర్వాత సిరా గుర్తును చూపిస్తూ..

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్​ 22న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Last Updated : Dec 13, 2020, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details