ర్యాంప్‌లపై వయ్యారంగా నడస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు కొందరు అందాల భామలు. అందుకు భిన్నంగా ఓ డంపింగ్‌యార్డులో క్యాట్‌వాక్ (model catwalk) చేసింది ప్రముఖ ఝార్ఖండ్ మోడల్ సురభి. ఇది పబ్లిసిటీ కోసం చేసింది కాదు..
వ్యర్థాల సమస్య..

ఈ షూట్ చేయడం ద్వారా ఝరీలోని వ్యర్థాల సమస్యపై ప్రజల్లో అవగాహన పెచాలని సంకల్పించారు ఫొటోగ్రాఫర్ ప్రాంజల్. రాంచీ రింగ్‌రోడ్డును ఆనుకుని ఉండే డంప్‌యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన, దానివల్ల స్థానికులు పడే అవస్థలు ఆయనను కలచివేశాయి. ఈ ఒక్క ప్రాంతం తప్పా.. దాదాపు రాంచీ మొత్తం పరిశుభ్రంగా ఉందని గుర్తించిన ప్రాంజల్.. ఝిరీ సమస్యను వెలుగులోకి తీసుకురావాలని భావించారు.
ఇదే విషయాన్ని మిస్ ఝార్ఖండ్ సురభితో మాట్లాడగా తొలుత ఆశ్చర్యపోయిన ఆమె.. చివరికి అంగీకరించారు. డ్రోన్లతో చిత్రీకరించిన ఈ వీడీయో, దాని ఉద్దేశం అందరి మెప్పును పొందుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:మళ్లీ డ్రగ్స్ కలకలం.. భయంతో బాత్రూంలో దాక్కున్న నటి!