లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఝార్ఖండ్లో ఓ పోలీసు అధికారిపై వేటు వేశారు. రాంచీలోని జాప్ 10 ఠాణా ఇన్ఛార్జ్గా విధులు నిర్వర్తిస్తోన్న శత్రుఘ్న సింగ్.. తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహచర మహిళా కానిస్టేబుల్ ఆరోపించారు.
రాంచీ సీనియర్ ఎస్పీ సురేంద్ర కుమార్ ఝాను కలిసి శత్రుఘ్నపై ఫిర్యాదు చేశారు బాధిత కానిస్టేబుల్. పీఎస్లో ఎవరు లేని సమయంలో అనుచితంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని బెదిరించారన్నారు.