తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జేఈఈ అడ్వాన్స్​డ్​​పై అప్పటి వరకు వేచి ఉండండి'

జేఈఈ అడ్వాన్స్​డ్​​- 2020 రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని పులువురు ఆశావహులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని యూపీఎస్సీ అంశం తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

jee aspirants fill a petition in supreme court regarding writing test one more time
'మరో అవకాశం ఇవ్వండి'

By

Published : Feb 15, 2021, 12:22 PM IST

Updated : Feb 15, 2021, 12:49 PM IST

కరోనా కారణంగా జేఈఈ 2020 పరీక్షలు రాయలేకపోయి.. మరో ఆవకాశం కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. గతంలో విచారణ ఎదుర్కొంటున్న యూపీఎస్పీ కేసు కూడా ఇలాంటిదే అని గుర్తు చేసింది. యూపీఎస్సీ కేసులో విచారణ రిజర్వ్​లో ఉన్నందున... ఈ కేసుపై విచారణను కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

జేఈఈ అడ్వాన్స్ 2020 కోల్పోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కరోనా కారణంగా పలువులు అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నందున ఇంకో అవకాశం ఇవ్వాలని ఆశావహులు పిటిషన్​లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎం ఖన్ విల్కర్ ధర్మాసనం.. గతంలో యూపీఎస్సీ కేసును కూడా ఇదే తరహాలోనే విచారణ చేపట్టిందని తెలిపింది. యూపీఎస్సీ కేసు తీర్పు తర్వాత జేఈఈ కేసుపై వాదనలు వింటామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: జేఈఈ పరీక్ష ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు పెంపు

Last Updated : Feb 15, 2021, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details