ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(Jee Advanced 2021) పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్(Jee Mains) ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల అడ్వాన్స్డ్ ప్రక్రియ వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ(Jee Advanced Registration) షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ఐఐటీ ఖరగ్పుర్ ప్రకటించింది.
ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. ఈ నెల 19 సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది.