తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లో ఎన్​కౌంటర్

Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

jammu kashmir encounter today
jammu kashmir encounter today

By

Published : Jul 18, 2023, 9:51 AM IST

Updated : Jul 18, 2023, 11:11 AM IST

Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్​లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి సూరంకోట్ మండలంలోని సింధారా ప్రాంతంలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్​ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారని.. అందులో భాగంగా రాత్రి 11.30 గంటల సమయంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. అనంతరం భద్రతా దళాలు.. డ్రోన్​లు, ఇతర పర్యవేక్షణ పరికరాలతో నిఘా ఉంచాయని చెప్పారు.

Jammu Kashmir Terrorists Killed : మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మళ్లీ ప్రారంభమైన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముకేశ్ సింగ్ వెల్లడించారు. ఈ ఎన్​కౌంటర్​లో మరణించిన ముష్కరులు విదేశీ ఉగ్రవాదులని.. వారి గుర్తించే చర్యలు ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్​ పోలీసు దళాలతో పాటు ఇతర దళాలు పాల్గొన్నాయని తెలిపారు.

'ఆపరేషన్ త్రినేత్ర-2లో భాగంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. పక్కా ఇంటెలిజెన్స్‌ సమాచారంతో.. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనా స్థలంలో నాలుగు AK-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్​కౌంటర్​ రాజౌరీ, పూంచ్​ ప్రాంతంలో ఉగ్రవాదులు తలపెట్టిన విధ్వంస కార్యక్రమాలను నివారించింది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది' అని భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ చేసింది.

మాదకద్రవ్యాలతో పాక్​ డ్రోన్లు..
మరోవైపు, పంజాబ్​లో పాకిస్థాన్ డ్రోన్ సరఫరా చేసిన డ్రగ్స్​ను సైన్యం స్వాధీనం చేసుకుంది. 'తార్న్ తరణ్ జిల్లా కల్సియాన్ ఖుర్ద్‌ గ్రామంలో రాత్రి సమయంలో పాకిస్థాన్​కు చెందిన డ్రోన్ వ్యవసాయ పొలాల్లో మాదకద్రవ్యాలను పడేస్తుండగా శబ్ధాలు వినిపించాయి. దాని కోసం గాలించగా హెరాయిన్‌తో కూడిన దాదాపు 2.350 కిలోలు ఉన్న మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాం' అని సరిహద్దు భద్రత దళం ట్వీట్​ చేసింది.

కుప్వారా సెక్టార్​లో ఎన్​కౌంటర్​..
గత నెలలో జమ్ముకశ్మీర్​లోని​ కుప్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​లోనూ నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. దీంతో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ముష్కరుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jul 18, 2023, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details