Mechanic Make A Super Scooter: మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ గత 50 ఏళ్లుగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కానీ అతడి వద్ద చెడిపోయిన పాత స్కూటర్ ఉండేంది. దీనిపై ప్రయాణించాలంటేనే కష్టంగా ఉండేంది. దీంతో ఆగ్రహించిన అక్రమ్ భార్య.. ఈ చెడిపోయిన స్కూటర్‌పై కూర్చొనని శపథం చేసింది. ఆమె మాటలు విన్న అక్రమ్.. స్కూటర్‌కు కొత్త రూపాన్ని ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించాడు. అనుకున్నదే ఆలస్యం పాత స్కూటర్‌ను మార్చే పనిలో నిమగ్నమయ్యాడు.
ఈ స్కూటర్లో అనేక ప్రత్యేకతలతో రూపొందించాడు మెకానిక్ మహ్మద్ అక్రమ్. స్కూటర్‌కు స్వయంగా పెయింట్ వేసి హెచ్డీ స్ర్కీన్‌ను అమర్చాడు. స్కూటర్‌కు కెమెరాలు, మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు పూర్తిగా లైట్లతో అందంగా తయారు చేశాడు. కొన్ని నెలల క్రితం అక్రమ్‌కు గుండెపోటు వచ్చి అతడి పరిస్థితి విషమంగా మారింది. కోలుకున్న వెంటనే అక్రమ్ తిరిగి స్కూటర్‌ను రూపొందించడం ప్రారంభించాడు. ఎంతో ఆకర్షణీయంగా తయారైన ఈ వాహనాన్ని 'సూపర్ స్కూటర్'గా పిలుస్తున్నారు.
పాత స్కూటర్‌పై రావడానికి నా భార్యకు ఇబ్బందిగా ఉండేది. స్కూటర్‌పై ప్రయాణించనని కోపం తెచ్చుకుంది. దీంతో స్కూటర్‌ను మార్చాలనే ఆలోచన వచ్చింది. గత 50 ఏళ్లుగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాను. దీంతో కారు మాదిరిగా స్ర్కీన్, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ అమర్చాను. ప్రస్తుతం లీటర్‌కు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. జైపుర్, అజ్మీర్ వెళ్లివచ్చాను. ఈ స్కూటర్‌ను తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టింది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల బ్యాటరీ అమర్చాలని అనుకుంటున్నాను. చాలా మంది విక్రయించాలని అడిగారు కానీ అమ్మలేదు. ఇప్పుడు స్కూటర్‌తో నా భార్య చాలా సంతోషంగా ఉంది.