గతేడాది అక్టోబర్‌లో ముగ్గురు భాజపా కార్యకర్తలను, ఓ పోలీస్ అధికారిని కాల్చి చంపిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్‌లోని సాంబా సెక్టార్ ప్రాంతంలో శనివారం అరెస్ట్ చేశారు. ఈ ముష్కరుడు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ.. ద రెసిస్టెన్స్ ఫోర్స్‌కు చెందిన జహూర్ అహ్మద్ రాథర్ అలియాస్ ఖలీద్‌గా గుర్తించారు.
భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్ - J-K Police arrests TRF terrorist who killed 3 BJP workers, cop
గతేడాది అక్టోబర్‌లో ముగ్గురు భాజపా కార్యకర్తలను, ఓ పోలీస్ అధికారిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముష్కరుడిని.. జహూర్ అహ్మద్ రాథర్ అలియాస్ ఖలీద్‌గా గుర్తించారు.
ముగ్గురు భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్
2020 అక్టోబర్ 29న కుల్గాం జిల్లాలోని వెస్సు ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భాజపా కార్యకర్తలు మరణించారు. ఫర్రాలో ఓ పోలీస్ ఆఫీసర్‌ను కాల్చి చంపారు.
ఇదీ చదవండి:ఉగ్రదాడిలో ముగ్గురు భాజపా కార్యకర్తలు మృతి