ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-పాక్​ నిర్ణయంపై కశ్మీరీ నేతల హర్షం - సరిహద్దు ఒప్పందంపై జేకేఎన్​సీ పార్టీ

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న భారత్​-పాక్​ నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్​ స్థానిక పార్టీలు స్వాగతించాయి.

J-K parties welcome India-Pakistan agreement
భారత్​-పాక్​ నిర్ణయాన్ని స్వాగతించిన జమ్ముకశ్మీర్ నేతలు
author img

By

Published : Feb 25, 2021, 5:06 PM IST

నియంత్రణ రేఖ వెంబడి శాంతి స్థాపనే లక్ష్యంగా భారత్, పాకిస్థాన్​ తీసుకున్న కీలక నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలు స్వాగతించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని ఇరు దేశాలు తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేశాయి.

"ఇరు దేశాలు... తాజాగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నాం. కాల్పుల విరమణ ఒప్పందానికి జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది. ఈ నిర్ణయం వల్ల సరిహద్దుల్లో నివసించే వారు ప్రశాంతంగా ఉండొచ్చు."

-జేకేఎన్​సీ పార్టీ.

భారత్-పాక్​ తీసుకున్న నిర్ణయాన్ని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. సరిహద్దుల్లో వివాదాలు ముగియాలంటే ఇరు దేశాలు చర్చించుకోవడమే సరైన మార్గమని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'

ABOUT THE AUTHOR

author-img

...view details