తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదం వైపు యువత.. అడ్డుకున్న పోలీసులు - militant

ఉగ్రవాదుల్లో కలవడానికి వెళ్లిన నలుగురు యువకులను జమ్ముకశ్మీర్​ పోలీసులు వెనక్కు రప్పించగలిగారు. అందులో ఇద్దరు టీనేజర్లు కాగా... వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

J&K: Police prevent 4 youths from joining militant ranks
ఉగ్రవాదం వైపు యువత.. అడ్డుకున్న పోలీసులు

By

Published : Mar 16, 2021, 5:08 PM IST

ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన నలుగురు జమ్ముకశ్మీర్​ యువకులను వెనక్కు రప్పించగలిగినట్లు శ్రీనగర్​ పోలీసులు తెలిపారు. బడ్​గామ్​​​, గాందర్​బల్​ నుంచి ఇద్దరు చొప్పున యువకులు తీవ్రవాదం వైపు మళ్లినట్లు వెల్లడించారు.

ఉగ్రవాదుల్లో కలవడానికి వెళ్లిన గాందర్​బల్​ జిల్లా బట్వినా, కుర్హమా ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు వారి కార్యకలాపాల సంగతి తెలియదని చెప్పారు.

మరో ఉదంతంలో బడ్​గామ్​లో కౌమార దశలో ఉన్న వ్యక్తులను తీవ్రవాదులతో కలవకుండా పోలీసులు నిరోధించగలిగారు. వారు మార్చి 14న తమ ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. పోలీసులు వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదీ చూడండి:ఒక్కరోజులోనే 30 లక్షల టీకాలతో భారత్​ రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details