తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధుమేహ రోగుల కోసం ప్రత్యేక 'కుక్కర్​'.. కశ్మీర్​ విద్యార్థుల ఘనత! - కుక్కర్​

మధుమేహ రోగులు అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయని భయపడుతుంటారు. రోజులో చాలా తక్కువగా అన్నం తీసుకుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేక కుక్కర్​ను(best rice cooker for diabetics) రూపొందించారు కశ్మీర్​ యువకులు. ఆటోమేటిక్​గా పని చేసే ఈ కుక్కర్(automatic rice cooker)​ విశేషాలు తెలుసుకుందాం.

rice cooker for diabetic patients
మధుమేహ రోగుల కోసం ప్రత్యేక 'కుక్కర్​'

By

Published : Nov 18, 2021, 2:42 PM IST

మధుమేహ రోగుల కోసం ప్రత్యేక 'కుక్కర్​'

ప్రస్తుత రోజుల్లో అన్నం వండేందుకు ప్రతి ఇంట్లో రైస్​ కుక్కర్(rice cooker)​ వాడటం సర్వసాధారణమైంది. బియ్యం, నీటిని తగిన మోతాదులో వేసి కుక్కర్​ ఆన్​ చేస్తే.. అన్నం తయారవుతుంది. కానీ, మన ప్రమేయం లేకుండానే, ఆటోమేటిక్​గా బియ్యం, నీటిని తీసుకుని అన్నం వండే కుక్కర్​ను ఎప్పుడైనా చూశారా? కశ్మీర్​ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ సరికొత్త రైస్​ కుక్కర్​ను తయారు చేశారు.

ఈ కుక్కర్​ ఆటోమేటిక్​గా అన్నం వండటమే(automatic rice cooker) కాదు.. మన సూచనల మేరకు బియ్యం నుంచి పిండిపదార్థాన్ని(గంజి) వేరు చేస్తుంది. ఇది మధుమేహ రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా(best rice cooker for diabetics) ఉంటుంది. అన్నంలో గంజి ఉండాలా? లేదా? అని నిర్ణయించే విధంగా ఈ కుక్కర్​ను తయారు చేశారు.

రైస్​ కుక్కర్​తో కశ్మీర్​ విద్యార్థులు

ఫోన్​ ద్వారా కమాండ్స్​..

జీఎస్​ఎమ్, ఐఓటీ ఆధారిత సాంకేతికత​ ద్వారా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్​​గా పని చేసే విధంగా రూపొందించారు. రైస్​ కుక్కర్​లో ప్రత్యేక ప్రోగ్రామింగ్​ చేయటం వల్ల మొబైల్​ ఫోన్​ ద్వారా కమాండ్స్​ అందుకుని 1-12 ఏళ్ల వయసుగల పిల్లల కోసమూ ఆహారం తయారు చేస్తుంది.

అయితే, ఈ రైస్​ కుక్కర్​లో మరో రెండు ఛాంబర్లు ఉంటాయి. వాటి ద్వారా ఆటోమేటిక్​గా నీరు, బియ్యాన్ని కుక్కర్​లో వేసేలా రూపొందించారు. అలాగే, ఎంతమందికి వండాలి, ఎంత రైస్​ తీసుకోవాలి అనే సూచనలనూ ఈ కుక్కర్​ పాటిస్తుంది. ఆహారం ఉడికిన తర్వాత.. ఫోన్​కు మెసేజ్​ పంపిస్తుంది.

ప్రోత్సాహం అవసరం..

ఈ కుక్కర్​ను(best rice cooker for diabetics) పెద్ద సంఖ్యలో తయారు చేసేందుకు అనుమతుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు విద్యార్థులు. ఇందులోని అన్ని భాగాలను కలిపి, సరికొత్త, ఆటోమేటిక్​ కుక్కర్​ను తయారు చేసేందుకు కొన్ని నెలల సమయం పట్టినట్లు చెప్పారు. డాక్టర్​ బిలాల్​ అహ్మద్​ మాలిక్​ పర్యవేక్షణలో సాజిద్​ నూర్​, జహాంగిర్​ హమీద్​, ఇమ్రాన్​ నజిర్​, అజ్రా హుస్సేన్​, అరిజ్​ కౌల్​లు ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

కశ్మీర్​ లోయలోని యువతలో పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల ట్రెండ్​ పెరుగుతోందని తెలిపారు డాక్టర్​ బిలాల్​ అహ్మద్​. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోత్సాహం అవసరమని తెలిపారు. ఇలాంటి తక్కువ ధర కుక్కర్​ మార్కెట్లోకి వస్తే సాధారణ ప్రజలతో పాటు మధుమేహ రోగులకు ఉపయోగపడుతుందన్నారు.

ఇదీ చూడండి:ఓ చిన్న సంభాషణ.. సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details