తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ITI JOBS 2023 : ట్రేడ్​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం! - ఐటీఐ ఉద్యోగాలు 2023

HCL Recruitment 2023 for ITI Jobs : నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్​ కాపర్​ లిమిటెడ్ 184 ట్రేడ్ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

HCL recruitment 2023
ITI JOBS 2023

By

Published : Jul 11, 2023, 10:39 AM IST

HCL Recruitment 2023 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్​. హిందూస్థాన్​ కాపర్​ లిమిటెడ్​ 184 ట్రేడ్​ అప్రెంటీస్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
ITI jobs trade apprentice 2023 : మేట్​, బ్లాస్టర్​, ఫిట్టర్​, వెల్డర్​, ఎలక్ట్రీషియన్​, కంప్యూటర్​ ఆపరేటర్​, సర్వేయర్​, మాసన్​, హార్టికల్చర్​ అసిస్టెంట్​

ట్రేడ్​ విభాగాలు
ITI trade list : ఈ నోటిఫికేషన్​ ద్వారా హిందూస్థాన్​ కాపర్​ లిమిటెడ్​లో.. మైన్స్, డీజిల్​, గ్యాస్​, ఎలక్ట్రిక్​, సివిల్​, మెకానికల్​ విభాగాల్లో ట్రేడ్​ అప్రెంటీస్​ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు ఏమిటి?
ITI trade apprentice eligibility : అభ్యర్థులు ట్రేడ్​ మేట్​ (మైన్స్​), బ్లాస్టర్​ (మైన్స్​) పోస్టులకు 10తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.

మిగతా ట్రేడ్​ విభాగాలకు చెందిన అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యా సంస్థ నుంచి 10+2 తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత ఐటీఐ విభాగంలోనూ క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి ఎంత?
ITI trade apprentice age limit : 2023 ఆగస్టు 05 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ITI trade apprentice selection process : 10వ తరగతి/ 10+2 తరగతి ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ ఉన్న అభ్యర్థులను వడపోస్తారు. ముఖ్యంగా 10వ తరగతి లేదా 10+2 తరగతిలో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఐటీఐలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు.

ట్రేడ్​ మేట్​ (మైన్స్​), బ్లాస్టర్​ (మైన్స్​) పోస్టుల విషయంలో 10తరగతి మార్కులకే 100 శాతం వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది. ఒక వేళ అభ్యర్థుల మార్కులు సమానంగా ఉండే, వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత కల్పిస్తారు. తరువాత వారికి శారీరక దృఢత్వ పరీక్షలు (ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్)​ నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన​ అభ్యర్థులను ట్రేడ్​ అప్రెంటీస్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం ఏమిటి?
ITI trade apprentice application process : అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్ https://www.apprenticeship.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రైనింగ్​ - జీతభత్యాలు
ITI trade apprentice salary : ఎంపికైన అభ్యర్థులకు ఆయా ట్రేడ్​లకు అనుగుణంగా ట్రైనింగ్​ ఇస్తారు. ఇదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారికి స్టైపెండ్​​ కూడా అందిస్తారు.

ముఖ్యమైన తేదీలు
HCL Recruitment 2023 important dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2023 జులై 6
  • దరఖాస్తులకు ఆఖరు తేదీ :2023 ఆగస్టు 5
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన తేదీ : 2023 ఆగస్టు 19

ABOUT THE AUTHOR

...view details