మహారాష్ట్రలో జైలు పర్యాటకం కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మహారాష్ట్రలోనే అతిపెద్దదైన, చారిత్రక నేపథ్యం ఉన్న ఎరవాడ జైలులో ఈ విశిష్ఠ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జైలు పర్యాటకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చారిత్రక నేపథ్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలు 150 ఏళ్ల నాటి గుర్తులు..
మహారాష్ట్రలోని పుణెలో 150 ఏళ్ల క్రితం.. 'ఎరవాడ జైలు'ను నిర్మించారు. బ్రిటిష్ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్, పటేల్, నేతాజీ వంటి నేతలెందరినో ఇక్కడ నిర్బంధించారు. వారి గుర్తులెన్నో ఇక్కడ నేటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకులు వాటినిప్పుడు చూసే అవకాశం వచ్చింది. మహాత్మాగాంధీకి, అంబేద్కర్‌కు మధ్య చరిత్రాత్మక 'పూనా ప్యాక్ట్' ఒప్పందం ఈ కారాగార ప్రాంగణంలోనే జరిగింది. ఇక్కడి చెట్లకిందే వారు ఆ ఒప్పందపై సంతకాలు చేశారు. ముంబయిలో 26/11 దాడుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు.
జైలు పర్యాటకం ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎరవాడ జైలులో మహాత్మగాంధీ గుర్తులు ఎరవాడ జైలులో నెహ్రూ గుర్తులు ఇలాంటి చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన జైలును ఇప్పుడు వీక్షించే అవకాశం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఇదీ చూడండి:'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన పళనిస్వామి