తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోనే తొలి 'పాడ్​ హోటల్​' ఇది.. అన్నింటికన్నా చౌక! - దీపావళి

రైలు ప్రయాణికులకు త్వరలోనే పాడ్​ హోటల్ అందుబాటులోకి రానుంది. ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, ఆధునిక వసతులతో ముంబయి సెంట్రల్ స్టేషన్​లో దీనిని నిర్మిస్తోంది ఐఆర్​సీటీసీ.

Pod Hotel
పాడ్​ హోటల్

By

Published : Aug 17, 2021, 6:02 PM IST

ముంబయి సెంట్రల్​లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్​ హోటల్'​ను నిర్మిస్తోంది భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్​సీటీసీ). స్టేషన్​ మొదటి అంతస్తులోని రెండు నాన్​ ఏసీ గదులను జపాన్​ తరహా క్యాప్సుల్​ హోటల్​గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు రాత్రివేళ బస కల్పించడానికి మొత్తం 30 గదులుంటాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరుకు వాటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.

ఎంతో చౌకగా.. దీపావళి కానుకగా

ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, తగిన వసతులతో రాత్రి వేళ పూర్తి భద్రత కల్పించే విధంగా వీటిని రూపొందిస్తున్నట్లు ఐఆర్​సీటీసీ అధికారులు తెలిపారు. "ఈ గదులను 12 గంటల పాటు అద్దెకు ఇస్తాం. మొత్తం రూ.1.80కోట్ల వ్యయంతో అధునాతన డిజైన్​లతో నిర్మాణం జరిగింది. దీపావళికి వరకల్లా వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం." అని వెల్లడించారు.

వాస్తవానికి 2020లోనే ఈ పాడ్​ హోటల్​ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆ పనులకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి:50 ఏళ్ల తర్వాత ఆ మార్గంలో తొలి​ రైలు!

ABOUT THE AUTHOR

...view details