తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోనే తొలి 'పాడ్​ హోటల్​' ప్రారంభం.. ఎక్కడంటే? - పాడ్​ హోటల్​లో గదులు

రైలు ప్రయాణికులకు పాడ్​ హోటల్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్​సీటీసీ. దీనిని ముంబయి సెంట్రల్ స్టేషన్​లో అధికారులు ప్రారంభించారు. ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, ఆధునిక వసతులతో ఈ హోటల్​ను నిర్మించింది ఐఆర్​సీటీసీ సంస్థ.

pod hotel
పాడ్​ హోటల్​

By

Published : Nov 17, 2021, 5:25 PM IST

Updated : Nov 17, 2021, 7:08 PM IST

ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్​ హోటల్'​ను అందుబాటులోకి తీసుకొచ్చింది భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్​సీటీసీ). స్టేషన్​ మొదటి అంతస్తులోని రెండు నాన్​ ఏసీ గదులను జపాన్​ తరహా క్యాప్సుల్​ హోటల్​గా మార్చింది. అందులో ప్రయాణికులకు రాత్రివేళ బస కల్పించడానికి అనువుగా మొత్తం 30 గదులుంటాయని అధికారులు తెలిపారు. ఈ హోటల్​లో ఉండాలంటే 12 గంటలకు రూ. 999, 24 గంటలకు రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉచిత వైఫై, టీవీ, చిన్న లాకర్​, అద్దం, రీడింగ్​ లైట్లు లాంటి వసతులు ఉన్నాయి.

అత్యాధునిక వసతులతో పాడ్​ హోటల్​ బెడ్​
క్యాప్సుల్​ హోటల్​
పూర్తి ఎయిర్​ కండీషన్​తో రూపుదిద్దుకున్న హోటల్​ గది

ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, తగిన వసతులతో రాత్రి వేళ పూర్తి భద్రత కల్పించే విధంగా వీటిని రూపొందించినట్లు ఐఆర్​సీటీసీ అధికారులు తెలిపారు. ఈ హోటల్ ఏర్పాటు కోసం సుమారు రూ.1.80కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.

పాడ్​ హోటల్​లో రిసెప్షన్​
పాడ్​ హోటల్​ గదులు
పాడ్​ హోటల్​లో రిసెప్షన్​

వాస్తవానికి 2020లోనే ఈ పాడ్​ హోటల్​ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆ పనులకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.

పాడ్​ హోటల్​లో హాలు
పాడ్​ హోటల్​ ఎంట్రన్స్​

ఇదీ చూడండి:పెళ్లికాని ప్రసాదుల్లా 40వేల మంది- 'వధువు' కోసం ఆ రాష్ట్రాల్లో వేట

Last Updated : Nov 17, 2021, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details