ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక డ్రోన్ విధ్వంసక వ్యవస్థ(యాంటీ డ్రోన్ సిస్టమ్)ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది భారత నావికాదళం. అత్యంత వేగవంతమైన శత్రు డ్రోన్లను సైతం కూల్చగలిగే సామర్థ్యం.. ఈ 'స్మాష్ 200' డ్రోన్ సిస్టమ్ సొంతం. వీటిని ఇజ్రాయెల్‌కు చెందిన స్మార్ట్ షూటర్ సంస్థ రూపొందించింది.ఇవి వచ్చే ఏడాది భారత్‌కు రానున్నాయి. అయితే భారత నావికాదళం ఎన్ని డ్రోన్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తుందో తెలియాల్సి ఉంది.
త్వరలో భారత్‌కు అత్యాధునిక డ్రోన్ విధ్వంసక వ్యవస్థ
ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక 'యాంటీ డ్రోన్ సిస్టమ్స్'ను కొనుగోలు చేసేందుకు భారత నావికా దళం ఒప్పందం కుదుర్చుకుంది. 'స్మాష్ 2000'ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్‌ను వచ్చే ఏడాదిలో భారత్‌కు అందించనుంది ఇజ్రాయెల్.
త్వరలో భారత్‌కు అత్యాధునిక డ్రోన్ విధ్వంసక వ్యవస్థ
నావికాదళం ప్రస్తుతం అత్యాధునిక డ్రోన్ వ్యవస్థను కొనుగోలు చేయటంపై దృష్టి సారించిందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వెల్లడించారు.
ఇదీ చదవండి :మిగ్-29కే కూలిన ఘటనలో పైలట్ మృతి