తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా సోమవారం 'యాస్' తుపాను ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం లోగా తీవ్ర తుపానుగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి, ఈ నెల 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనున్నట్లు వారు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 185 కి.మీ. వరకూ పెరిగే అవకాశముందన్నారు. ఆ తర్వాత అది క్రమేపీ బలహీనపడిపోతుందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు
తుపాను ప్రభావంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 'మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తీవ్రత కొనసాగుతుంది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ నెల 26న తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్రలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుంది' అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి 27లోపు ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల ఉంటాయన్నారు. చేపల వేట నిషేధ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి యాస్ తుపాను గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. అది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో, పారాదీప్‌కి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
సీఎంలతో అమిత్‌షా సమీక్ష