Indian Army Soldiers Snow: జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. అయినా భారత సేనలు దేశ రక్షణ కోసం సరిహద్దుల వెంట గస్తీ నిర్వహిస్తున్నాయి. సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తున ఉన్న కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ మంచు ఖండాన్ని తలపిస్తోంది. పెద్దఎత్తున మంచు కురుస్తున్నా వీర సైనికులు ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు.
కేరన్ సెక్టార్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. సైనికులు ఎప్పటిలాగే పహారా కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి లేదు. అయినా స్నోస్కూటర్లపై గస్తీ నిర్వహిస్తున్నారు. సరిహద్దు సమీప ప్రాంతాల్లో కంటి రెప్ప వాల్చకుండా శత్రుమూకల కదలికలపై నిఘా పెట్టారు.