తాలిబన్ల హస్తగతమైన తర్వాత అఫ్గాన్‌లో(Taliban Crisis in Afghanistan) చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాబుల్(Kabul) నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 యుద్ధ విమానం.. భారత్‌కు చేరుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్‌కు చేరుకున్నారు.
హిండన్ వైమానిక స్థావరంలో.. స్వదేశానికి చేరిన భారతీయులు వీల్-ఛైర్లో మహిళను తీసుకువస్తున్న దృశ్యం కరోనా విజృంభణ నేపథ్యంలో కాబుల్ నుంచి హిండన్ చేరుకున్న వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
హిండన్ వైమానిక స్థావరంలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు హిండన్ వైమానిక స్థావరంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు అంతా నాశనం..
భారత్‌కు చేరిన విమానంలో అఫ్గాన్‌కు చెందిన ఎంపీ నరేందర్ సింగ్ ఖాస్లా కూడా ఉన్నారు. '20 ఏళ్లుగా నిర్మించుకున్నదంతా.. నాశనమైపోయింది' అంటూ గద్గద స్వరంతో ఆయన చెప్పారు.
అంతకుముందు, కాబుల్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి సారించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అప్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య.. 400 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
పోలియో రహితంగా ఉండేందుకు..
మరోవైపు.. అఫ్గాన్ నుంచి వచ్చిన వారందరికీ పోలియో టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీకా తీసుకుంటున్న వారి ఫొటోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
దిల్లీలో అఫ్గాన్ నుంచి వచ్చినవారికి పోలియో టీకాలు వేస్తున్న దృశ్యం ఇదీ చూడండి:Afghan: తాలిబన్ల నుంచి తప్పించి.. సూపర్ వుమన్‌గా నిలిచి!
ఇదీ చూడండి:Afghan crisis: ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..