తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2021 చివరికల్లా వయోజనులందరికి టీకా'

2021 చివరికల్లా దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్​ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ కట్టడి చర్యలపై ఆరా తీశారు.

harsha vardhan
హర్ష వర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి

By

Published : May 22, 2021, 5:23 AM IST

Updated : May 22, 2021, 2:20 PM IST

2021 చివరి కల్లా దేశంలోని వయోజనులు మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. కరోనా పరిస్థితులు సమీక్షించేందుకు 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు.

"2021 ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో భారత్​ 216 కోట్ల వ్యాక్సిన్​ డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఈ జులై కల్లా 51 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తుంది. రానున్న రోజుల్లో వైరస్​ రూపాంతరం చెంది పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ ఎలాంటి మ్యుటెంట్లనైనా ఎదుర్కొనేలా వైద్య సౌకర్యాల ఏర్పాటు జరుపుతున్నాం."

--హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి.

మ్యూకర్​మైకోసిస్​ వ్యాప్తిని కూడా రాష్ట్రాలు దృష్టిలో ఉంచుకోవాలని హర్షవర్ధన్ సూచించారు. ఛత్తీస్​గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్, ఛండీఘడ్, దాద్రా నగర్ హవేలి, దీవ్, లద్దాఖ్, లక్ష్యద్వీప్ ప్రాంతాల్లో కొవిడ్​ కట్టడికి చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.

ఇదీ చదవండి:యాంటీబాడీల నిర్ధరణకు డీఆర్​డీఓ 'కిట్​'

Last Updated : May 22, 2021, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details