తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కరోజులోనే 30 లక్షల టీకాలతో భారత్​ రికార్డ్​ - కేంద్ర ఆరోగ్య శాఖ వార్తలు

కొవిడ్​-19 వ్యాక్సినేషన్​లో భారత్​ దూసుకుపోతోంది. సోమవారం ఒక్కరోజే 30 లక్షల మందికిపైగా వ్యాక్సిన్​ అందించి.. కొత్త రికార్డ్​ సృష్టించింది.

India surpasses single day record with over 3 million vaccinations in one day
ఒక్కరోజులోనే 30లక్షలకుపైగా టీకాలతో భారత్​ రికార్డ్​

By

Published : Mar 16, 2021, 4:12 PM IST

కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులోనే 30లక్షల 39వేల 394 మందికి టీకా అందించి.. ఈ ఘనత సాధించిన తొలిదేశంగా నిలిచిందని పేర్కొంది. మార్చి 15న(59వ రోజు) చేపట్టిన వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ద్వారా ఈ ఘనత సాధించినట్టు తెలిపింది.

ఫలితంగా.. దేశంలో మొత్తం టీకా లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 29 లక్షల 47వేల 432 దాటినట్టు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు 5లక్షల 55వేలకుపైగా సెషన్లు నిర్వహించినట్టు పేర్కొంది. వ్యాక్సిన్​ లబ్ధిదారుల్లో సుమారు కోటి మందికిపైగా 60ఏళ్ల పైబడిన వారే ఉన్నారని వివరించింది.

ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 24,492 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details