తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ను వెంటాడుతున్న పోషకాహార సమస్య - గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​

దేశంలో ఆకలి కేకలు నిత్యం పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీ (global hunger index 2021) విడుదల చేసిన ర్యాంకుల్లో భారత్​.. 101వ స్థానంలో నిలిచింది భారత్​. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ గణాంకాలు వెల్లడించాయి.

global hunger index
భారత్​ను వెంటాడుతున్న పోషకాహార సమస్య

By

Published : Oct 15, 2021, 3:52 AM IST

దేశ పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వటంలేదని (global hunger index 2021) ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌- జీహెచ్‌ఐ) 2021 స్పష్టంచేస్తోంది. దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ క్షుద్బాధ, పోషకాహార లోపాలు వంటివి చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. 116 దేశాల జాబితాతో వెలువడిన ప్రపంచ ఆకలి సూచీలో (global hunger index 2021) భారత్‌ 101వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, నేపాల్​, పాకిస్థాన్‌ ఇదే విభాగంలో ఉన్నప్పటికీ..మన కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి.

మరింత దిగజారింది..

గత ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో (global hunger index 2021) 107 దేశాల వివరాలు వెల్లడి కాగా అప్పుడు మన దేశం 94వ స్థానంలో ఉంది. అంటే క్షుద్బాధ నివారణలో గత ఏడాది 93 దేశాలు మనకన్నా అగ్రభాగాన ఉంటే.. ఈ ఏడాది అటువంటి దేశాల సంఖ్య 100కి పెరిగింది. పర్యవేక్షణ కొరవడటం, పోషకాహార లోపాలను సరిదిద్దలేకపోవటం వంటివి మన దేశం వెనుకబాటుకు కారణాలుగా ఉన్నాయని విశ్లేషించారు.

  • చైనా, కువైట్‌, బ్రెజిల్​ తదితర 18 దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆకలి సూచీ వెబ్‌సైట్‌ వెల్లడించింది.
  • దేశంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువులేని వారి శాతం 1998-2002 మధ్య 17.1గా ఉండగా.. 2016-2020 మధ్య ఈ సంఖ్య 17.3కి పెరిగిందని తెలిపింది.
  • ప్రస్తుత గణాంకాల ప్రకారం 2030 నాటికి కూడా 47 దేశాలు తీవ్ర పోషకాహార సమస్యలు ఎదుర్కొంటాయని పేర్కొంది.

కరోనా మహమ్మారి ఈ గణాంకాల మీద తీవ్ర ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది.

ఆకలి సూచీల ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకున్న అంశాలు...

పౌష్టికాహారలోపం, చిన్నారులు ఎత్తుకుతగిన బరువు లేకపోవటం, అయిదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపాలు, వయసుకు తగిన బరువులేకపోవటం, శిశుమరణాల రేటు.

ఇదీ చూడండి :Potash Subsidy: రైతులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details