భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona cases in India) స్థిరంగా నమోదవుతోంది. కొత్తగా 33,376 మంది వైరస్(Corona Update) బారినపడ్డారు. మరో 308 మంది మరణించారు. ఒక్కరోజే 32,198 మంది కరోనాను జయించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే.. 25,010 కేసులు నమోదవడం గమనార్హం.
- మొత్తం కేసులు:3,32,08,330
- మొత్తం మరణాలు:4,42,317
- మొత్తం కోలుకున్నవారు:3,23,74,497
- యాక్టివ్ కేసులు:3,91,516
పరీక్షలు..
దేశవ్యాప్తంగా శుక్రవారం 15,92,135 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 54,01,96,989కి చేరినట్లు చెప్పింది.
వ్యాక్సినేషన్
శుక్రవారం ఒక్కరోజే 65,27,175 కొవిడ్ టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 73,05,89,688 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 595,894 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 224,614,354కు చేరగా.. మరణాల సంఖ్య 4,629,925కు పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా- 171,125
- బ్రెజిల్- 15,951
- రష్యా- 18,341
- బ్రిటన్- 37,622
- ఫ్రాన్స్- 9,966
- టర్కీ-23,562
- ఇరాన్-21,114
ఇవీ చూడండి: