తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Update: దేశంలో కరోనా తగ్గుముఖం- కొత్త కేసులు ఎన్నంటే?

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య(Corona cases in India) క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 27,254 మందికి వైరస్​(Corona Update) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 219 మంది కొవిడ్(Covid-19)​ బారిన పడి మరణించారు.

Corona cases in India
దేశంలో కరోనా కేసులు

By

Published : Sep 13, 2021, 9:56 AM IST

Updated : Sep 13, 2021, 10:16 AM IST

భారత్​లో కొవిడ్​ వ్యాప్తి (Corona cases in India) తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా 27,254 మంది వైరస్​(Corona Update) బారినపడ్డారు. మరో 219 మంది మరణించారు. ఒక్కరోజే 37,687 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు:3,32,64,175
  • మొత్తం మరణాలు:4,42,874
  • మొత్తం కోలుకున్నవారు:3,24,47,032
  • యాక్టివ్ కేసులు:3,74,269

పరీక్షలు..

దేశవ్యాప్తంగా ఆదివారం 12,08,247 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 54,30,14,076కు చేరినట్లు చెప్పింది.

వ్యాక్సినేషన్

దేశంలో (covid india update) కొత్తగా 53,38,945 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేయగా.. మొత్తం టీకా డోసుల సంఖ్య 74,38,37,643కు చేరింది.

ప్రపంచ దేశాల్లో..

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,73,216 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 5,913 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 46,43,667కు చేరగా.. మరణాల సంఖ్య 46,43,667కు పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా- 35,450
  • బ్రెజిల్​- 10,615
  • రష్యా- 18,554
  • బ్రిటన్​- 29,173
  • టర్కీ-21,352
  • ఇరాన్​-20,219

ఇవీ చూడండి:

Last Updated : Sep 13, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details