India Omicron Cases: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా వచ్చిన వాటిలో ముంబయిలోనే అత్యధికంగా 53 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
ఒమిక్రాన్ పంజా.. మహారాష్ట్రలో కొత్తగా 85 కేసులు
Omicron Cases In India: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దిల్లీ, రాజస్థాన్, గుజరాత్ సహా ఇంకొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
PM Modi UAE visit
వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఇలా..
- పంజాబ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెలలో ఆరంభంలో స్పెయిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు
- కర్ణాటకలో మరో ఐదుగురికి ఒమిక్రాన్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది.
- రాజస్థాన్‌లో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 23 మందికి ఒమిక్రాన్ సోకింది. వీరిలో నలుగురు విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి ఎగబాకింది.
- తమిళనాడులో కొత్తగా 11 మందికి ఒమిక్రాన్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45కు చేరింది. అయితే ప్రజలు భయపడాల్సిన పనిలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ భరోసా ఇచ్చారు. కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొరుగు రాష్ట్రం కేరళలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపథ్యంలో.. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
- Delhi omicron cases: దిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక్కరోజే 73మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 238కు చేరింది. ఈ నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించింది దిల్లీ సర్కారు. సిటీ బస్సులను 50 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు. మెట్రోలోనూ 50 శాతం ప్రయాణికులనే అనుమతిస్తున్నారు. దీంతో బస్టాపులు, మెట్రో స్టేషన్ల ముందు భారీ క్యూలు కనిపించాయి. దేశ రాజధానిలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు.
- ఒడిశాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి ఒడిశా చేరుకున్న ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు.
- కేరళలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 65 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కఠిన ఆంక్షలు విధించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2వరకు ఇది అమలు కానుంది. డిసెంబరు 31 రాత్రి 10 గంటల తర్వాత న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- బంగాల్లో మరో ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 11కు పెరిగింది.
- బ్రిటన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన యువకుడిలో ఒమిక్రాన్‌ను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
- గుజరాత్లో తాజాగా 19 కేసులు నమోదవగా.. మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 92కు చేరింది.
ఇదీ చూడండి:'కడుపులో కొకైన్.. ఆమె అండర్వేర్లో గోల్డ్.. సబ్బు పెట్టెల్లో డ్రగ్స్!'
Last Updated : Dec 29, 2021, 10:57 PM IST