తెలంగాణ

telangana

సైనిక శక్తిలో నాలుగో స్థానంలో భారత్​

By

Published : Mar 21, 2021, 12:02 PM IST

ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్న దేశాల్లో భారత్​ నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. 'అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్' పేరిట రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు, సైనికులు, వైమానిక, నావికాదళ సహా పలు అంశాల ఆధారంగా చేసిన ఈ అధ్యయనంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా, రష్యా తర్వాత వరుసలో ఉన్నాయి.

India has world's fourth strongest military: Military Direct's study
సైనిక శక్తిలో నాలుగో స్థానంలో భారత్​

ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. రక్షణ రంగానికి చెందిన 'మిలటరీ డైరెక్ట్' నిర్వహించిన పరిశోధనలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా, రష్యా తర్వాత స్థానాల్లో ఉన్నట్లు వెల్లడైంది. 'అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్' పేరిట రక్షణరంగానికి బడ్జెట్ కేటాయింపులు, సైనికులు, వైమానిక, నావికాదళ, భూతల, అణ్వస్త్ర సామర్థ్యం ఆధారంగా ఈ పాయింట్లను మిలటరీ డైరెక్ట్‌ కేటాయించింది.

ముఖ్యాంశాలు..

  • వందకు 82 పాయింట్లతో సైనిక శక్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది.
  • భారీ బడ్జెట్ కేటాయింపులు ఉన్న అమెరికా 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
  • 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో ఉంది.
  • 61 పాయింట్లతో భారత్​ నాలుగో స్థానంలో నిలిచింది.
  • సైనిక బడ్జెట్‌ పరంగా 732 బిలియన్‌ డాలర్లతో అమెరికా ‌అగ్రస్థానంలో నిలవగా, 261 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత రక్షణ బడ్జెట్‌ 71 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • సముద్ర ఆయుధ వ్యవస్థలో చైనా, గగనతల ఆయుధ వ్యవస్థలో అమెరికా, భూతల సైనిక శక్తిలో అమెరికా మేటిగా ఉన్నాయి.

ఇదీ చూడండి:'మంత్రికి 100 కోట్లు' లేఖ వ్యవహారంలో కొత్త ట్విస్ట్

ABOUT THE AUTHOR

...view details