తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం గుడ్​న్యూస్.. విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేత - ఇండియా విమాన సర్వీసులు

India flight services: అంతర్జాతీయ విమాన సర్వీసులపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 27నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

INTERNATIONAL PASSENGER SERVICES
INTERNATIONAL PASSENGER SERVICES

By

Published : Mar 8, 2022, 8:34 PM IST

India flight services: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో రెండు సంవత్సరాల తర్వాత విమాన సర్వీసులకు మోక్షం లభించనుంది.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని విమాన సర్వీసులను నడపనున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఎయిర్​బబుల్ నిబంధన సైతం ఎత్తివేయనున్నట్లు ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. విమాన సంస్థలు కేంద్ర వైద్య శాఖ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు.

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై సస్పెన్షన్ విధించింది. 2020 మార్చి 23 నుంచి సస్పెన్షన్ అమలులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 26 రాత్రి 11.59 గంటల వరకు ఇది కొనసాగనుంది.

ఇదీ చదవండి:ఈవీఎం స్ట్రాంగ్​రూంపై బైనాక్యులర్స్​తో ఎస్​పీ అభ్యర్థి నిఘా

ABOUT THE AUTHOR

...view details