సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న భారత్-పాక్ తాజా నిర్ణయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌తో స్వేహపూర్వకంగా ఉండాలని భారత్ ఆశిస్తుందని, శాంతియుతంగా చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
"పాక్‌తో సత్సంబంధాలు పెంచుకునేందుకు భారత్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను శాంతియుతంగా, ద్వైపాక్షికంగా చర్చించుకునేందుకు భారత్ కృషి చేస్తుంది."