దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 10,197 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India) ధాటికి మరో 301 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 527రోజుల కనిష్ఠానికి పడిపోయాయి.
- మొత్తం కేసులు: 3,44,66,598
- మొత్తం మరణాలు: 4,64,153
- యాక్టివ్ కేసులు: 1,28,555
- కోలుకున్నవారు: 3,38,73,890
జమ్ములో నైట్ కర్ఫ్యూ..
జమ్ముకశ్మీర్‌లో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున బుధవారం నుంచి.. రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్ము మేజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ హెచ్చరించారు. కర్ఫ్యూ నిబంధనలపై అధికారులంతా ప్రజలకు అవగాహన కల్పించాలని మేజిస్ట్రేట్ కార్యాలయం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
'ఇటీవల పాజిటివిటీ రేటు 0.2 శాతం పెరిగింది. మహమ్మారిని అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని జిల్లా పాలనాధికారి తెలిపారు.