India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. కొత్తగా 7,974 కేసులు నమోదయ్యాయి. మరో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,948 మంది కోలుకున్నారు.
మొత్తం కేసులు: 3,47,18,602
మొత్తం మరణాలు: 4,76,478
యాక్టివ్ కేసులు: 87,245
కోలుకున్నవారు: 3,41,54,879
Vaccination in India:
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగానే సాగుతోంది. బుధవారం 60,12,425 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,35,25,36,986కు చేరింది.
Covid cases Worldwide
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవమే చేస్తోంది. కొత్తగా 7,07,768 కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాల్లో సుమారుగా 7,822 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
- అగ్రరాజ్యం అమెరికా డెల్టా వేరియంట్‌తో అతలాకుతలమవుతోంది. మరో లక్షా 36,590 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల వ్యవధిలో 1,690 మంది మరణించారు. కోటికి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- అటు, యూకే సైతం కరోనాతో అల్లాడుతోంది. 78 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. 165 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 10 లక్షలు దాటింది.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 65 వేల కేసులు నమోదయ్యాయి. 151 మంది వైరస్‌కు బలయ్యారు. జర్మనీలో 55 వేల మంది కరోనా బారిన పడగా.. 509 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కరోనా మరణాలు ఆందోలనకర రీతిలో పెరుగుతున్నాయి. 1,142 మంది ఒక్కరోజే మరణించారు. తాజాగా 28,363 మందికి వైరస్ సోకినట్లు తేలింది.
ఇదీ చదవండి:'డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజర్.. డబ్లింగ్ రేటు రెండు రోజులే'