India Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 10,649 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించారు. ఒక్కరోజులో 10,677 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసులు 0.22 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 4,43,68,195
- క్రియాశీల కేసులు: 96,442
- మొత్తం మరణాలు: 5,27,452
- కోలుకున్నవారు: 4,37,44,301
Vaccination India: భారత్‌లో మంగళవారం 27,17,979 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,10,58,83,682 కు చేరింది. మంగళవారం మరో 4,07,096 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 700,610 కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 1,830 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 60,22,22,965 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,475,893 మంది మరణించారు. ఒక్కరోజే 8,66,392మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,59,61,246కు చేరింది.
- జపాన్‌లో కొవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. 1,85,497 మంది వైరస్ బారినపడ్డారు. మరో 269 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా 1,50,098 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 52 మంది మరణించారు.
- జర్మనీ, అమెరికాల్లో మరో 50 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి.
- ఇటలీలో 35,537 మంది కొవిడ్ బారిన పడగా, 294 మంది చనిపోయారు.