India Corona cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 2,828కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 14 మంది ప్రాణాలు విడిచారు. మరో 2035 మంది కోలుకున్నారు.
- మొత్తం కరోనా కేసులు: 4,31,53,043
- మొత్తం మరణాలు: 5,24,586
- యాక్టివ్ కేసులు: 17,087
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,11,370
Vaccination India:దేశవ్యాప్తంగా శనివారం 13,81,764మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,28,44,077కు చేరింది. ఒక్కరోజే 4,74,309 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 439,818 మంది వైరస్ బారినపడ్డారు. మరో 713 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 531,379,033కుచేరింది. మరణాల సంఖ్య 6,310,376కు చేరింది. ఒక్కరోజే 423,932 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 502,003,755గా ఉంది.
- బ్రెజిల్లో కొత్తగా 55,261 కేసులు బయటపడ్డాయి. వైరస్ ధాటికి 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 32,810 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 58 మంది మృతిచెందారు.
- జర్మనీలో కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 26,097 కేసులు వెలుగుచూశాయి.
- ఫ్రాన్స్‌లో తాజాగా 23,582 కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. తైవాన్‌లో శనివారం ఒక్కరోజే 80వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.