India Corona cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 2,338మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా మరో 19 మంది ప్రాణాలు విడిచారు. మరో 2,134 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కరోనా కేసులు:4,31,58,087
- మొత్తం మరణాలు: 5,24,630
- యాక్టివ్ కేసులు: 17,883
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,15,574
వ్యాక్సినేషన్ @500 రోజులు :దేశంలో కరోనా టీకాల పంపిణీ మొదలై 500 పూర్తవుతోంది. పిల్లలు, పెద్దలకు టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మరో 13,33,064 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,45,19,805కు చేరింది. ఒక్కరోజే 3,63,883 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగానే పెరిగాయి. అన్నిదేశాల్లో కలిపి మరో 3,39,294 కేసులు వెలుగుచూశాయి. మరో 828 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,19,50,272కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 63,11,801గా ఉంది. వైరస్ బారినపడినవారిలో 50,28,89,582 మంది కోలుకున్నారు.
- వైరస్ ఉద్ధృతి ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలో కొత్తగా 1,00,710 కేసులు నమోదయ్యాయి. మరొక్కరు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,549,590కి చేరింది. మరణాల సంఖ్య 70గా ఉంది.
- ఆస్ట్రేలియాలో తాజాగా 26,604 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 10 మంది మృతిచెందారు.
- బ్రెజిల్లో కొత్తగా 24,082 కేసులు నమోదయ్యాయి. మరో 72 మంది చనిపోయారు.
- జర్మనీలో మరో 23,406 కేసులు వెలుగుచూశాయి. మరో 87మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి:ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి