India Corona Cases: దేశంలో కొవిడ్ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207 కేసులు నమోదయ్యాయి. 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది.
మొత్తం కరోనా కేసులు: 4,31,05,401
మొత్తం మరణాలు:5,24,093
యాక్టివ్ కేసులు: 20,403
కోలుకున్నవారి సంఖ్య: 4,25,60,905
Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 13,50,622 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,34,90,396కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల 36 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం.
World Covidcases: ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా మొత్తం 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 600 మందికిపైగా మరణించారు.
- దక్షిణ కొరియాలో అత్యధికంగా 40వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. 71 మరణాలు నమోదయ్యాయి.
- ఆస్ట్రేలియాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మరో 35వేల మందికి వైరస్ సోకగా.. 18 మంది మరణించారు.
- జపాన్‌లో కొత్తగా 34వేల మందికి వైరస్ సోకింది. మరో 24 మంది మరణించారు.
- ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 30 వేలమందికిపైగా వైరస్ బారినపడ్డారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 29 వేల మందికి వైరస్ సోకగా.. మరో 54 మంది చనిపోయారు.
- అమెరికాలో వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 14వేల మందికి వైరస్ నిర్ధరణ అయింది. 21 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:శవాలను కూర్చోబెట్టి స్టూడెంట్స్‌కు క్లాస్- డాక్టర్ ప్రయోగం సక్సెస్!