భారత్లో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు 4 లక్షల మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ మొత్తం మరణాల్లో గత రెండు నెలల్లోనే సగానికి పైగా మందిని వైరస్ పొట్టనబెట్టుకోవడం గమనార్హం.
అమెరికా, బ్రెజిల్ తర్వాత 4 లక్షలకు పైగా మరణాలు నమోదైన మూడో దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కారణంగా 39 లక్షల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు.
మొదటి మరణం అప్పుడే..
గురువారం(జులై 1) 853 మంది మరణించగా మొత్తం కేసుల సంఖ్య 4,00,312కు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో వేవ్ దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 34 కోట్ల టీకాలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొంది.