మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్నవారిపై ఆ దేశ సైన్యం వ్యవహరిస్తున్న తీరును భారత్ తప్పుపట్టింది. దేశంలో చట్టపరమైన పాలన అవశ్యకతను గుర్తిస్తూ.. రాజకీయ బంధీలను విడుదల చేయాలని కోరింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.
"హింసాత్మక ఘటనలను మేం ఖండిస్తున్నాం. చట్ట నిబంధనలు ప్రబలంగా ఉండాలని విశ్వసిస్తున్నాం. మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిరించాలని ఆశిస్తున్నాం. నిర్భంద రాజకీయ నేతలను విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి మద్దతుగా నిలుస్తాం. సమతుల్య, నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అవసరమైతే ఐరాస భద్రతా మండలితో సంప్రదింపులు జరుపుతాం."
- అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి